-
-
Home » Andhra Pradesh » Krishna » students dont take drugs
-
విదార్థులూ.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి
ABN , First Publish Date - 2020-12-19T06:19:43+05:30 IST
మాదకద్రవ్యాలను విద్యా ర్థులకు అలవాటు చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారిబారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కైకలూరు సీఐ సి.వి.వి. ఎల్.నాయుడు అన్నారు.

సీఐ నాయుడు
కైకలూరు : మాదకద్రవ్యాలను విద్యా ర్థులకు అలవాటు చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారిబారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కైకలూరు సీఐ సి.వి.వి. ఎల్.నాయుడు అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సీఐ మాట్లాడుతూ విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే చట్టవ్యతిరేక పనులకు పాల్పడతారన్నారు. దీంతో అమూల్య మైన జీవితం కోల్పోతారన్నారు. ప్రిన్సిపాల్ బి.రఘునాథరెడ్డి, ఎస్సై షణ్ముఖసాయి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. కృత్తివెన్ను : మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనార్థాలను ఎస్సై రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగహన సదస్సు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌తో పాటు, 216 జాతీయ రహదారిపై ప్రజలకు అవగహన కల్పించారు.