మర్యాదగా మాట్లాడండి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-09-16T09:32:27+05:30 IST

బాధితులతో ఓదార్పుగా మాట్లాడితే సగం సమస్య పరిష్కారమవుతుందని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు అన్నారు. మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో మంగళవారం మత సామరస్యంపై ఇష్టాగోష్టి

మర్యాదగా మాట్లాడండి : ఎస్పీ

 మచిలీపట్నం టౌన్‌ : బాధితులతో ఓదార్పుగా మాట్లాడితే సగం సమస్య పరిష్కారమవుతుందని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు అన్నారు. మచిలీపట్నం సువర్ణ కళ్యాణ మండపంలో మంగళవారం మత సామరస్యంపై ఇష్టాగోష్టి జరిగింది. సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అంతర్వేదిలో రథం దగ్ధం వంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు.


దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు తమ దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖాజావలి, బందరు డీఎస్పీ మెహబూబ్‌ బాషా, వ్యక్తిత్వ వికాస నిపుణుడు విడియాల చక్రవర్తి, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఆర్‌పేట సీఐ వెంకటేశ్వరరావు, రూరల్‌ సీఐ కొండయ్య, ఏ. నాగేశ్వరరావు, ఫైర్‌ ఆఫీసర్‌ రామకృష్ణ, తదితరులు మాట్లాడారు.

Updated Date - 2020-09-16T09:32:27+05:30 IST