జగ్గయ్యపేటలో రూ.44,180 స్వాధీనం

ABN , First Publish Date - 2020-09-03T08:35:28+05:30 IST

జగ్గయ్యపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, ఐదుగురు అనధికార వ్యక్తుల నుంచి రూ.44,180 స్వాధీనం చేసుకున్నారు...

జగ్గయ్యపేటలో రూ.44,180 స్వాధీనం

జగ్గయ్యపేట, సెప్టెంబరు 2 : జగ్గయ్యపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, ఐదుగురు అనధికార వ్యక్తుల నుంచి రూ.44,180 స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ ఏఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీనివాస్‌ పలువురు సీఐలు, ఎస్‌ఐల దాడుల్లో పాల్గొన్నారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.11,180, ముగ్గురు డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద రూ.33,000 లభించినట్టు డీఎస్పీ తెలిపారు. కార్యాలయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దాడి చేశామని అనేక రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-03T08:35:28+05:30 IST