ఎస్‌ఈబీ విస్తృత తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-07T06:33:32+05:30 IST
ఎస్‌ఈబీ విస్తృత తనిఖీలు

విజయవాడ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఎస్‌ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పేకాడుతున్న, అక్రమంగా మద్యం, ఇసుక సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. రామవరప్పాడు ఔటర్ రింగ్ ప్రాంతంలో పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.లక్షా6వేలు, కారు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో గుట్కా, విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, రూ.85వేల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు టన్నుల ఇసుకను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సూర్యారావుపేట పీఎస్ పరిధిలో ట్రాక్టర్‌తో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 24 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. భవానీపురంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.