మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2020-12-27T05:45:57+05:30 IST

మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి

మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి

బీసీ సంఘాల డిమాండ్‌

తిరువూరు: గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యనించడం హేయమని, మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బీసీ సంఘాల నాయకుడు కందిమళ్ల శేషగిరిరావు అధ్యక్షతన శనివారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. క్షమాపణలు చెప్పకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హనుమంతు శ్రీనివాసరావు, పంది శ్రీనివాసరావు, నిమ్మనపూడి విజయకుమార్‌, పర్వతం శ్రీను, పామర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:45:57+05:30 IST