-
-
Home » Andhra Pradesh » Krishna » sand
-
బుసక దందాను అరికట్టాలి
ABN , First Publish Date - 2020-12-27T06:07:30+05:30 IST
అవనిగడ్డ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, బుసక దందాను అరికట్టాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.

అఖిలపక్షం డిమాండ్
అవనిగడ్డ రూరల్, డిసెంబరు 26 : అవనిగడ్డ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, బుసక దందాను అరికట్టాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. పులిగడ్డలో అక్రమంగా ఇసుక తవ్విన ప్రదేశాన్ని వారు శనివారం పరిశీలించి నిరసన తెలిపారు. పులిగడ్డలో 2 రెండు రోజుల క్రితం జరిగిన అక్రమ ఇసుక దందా చూస్తే నిబంధనలు అతిక్రమించార న్నారు. దివిసీమ ప్రాంతానికి ఉన్న ప్రధాన పంట కాలువ ఆక్విడెక్ట్ ఒక్కటి మాత్రమేనని, దానికి వంద మీటర్లలోపు ఇసుక అక్రమ దందా జరిగిందంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, రాయపూడి వేణుగోపాలరావు పాల్గొన్నారు.