-
-
Home » Andhra Pradesh » Krishna » salam case
-
అబ్దుల్ సలాం కేసును సీబీఐకు అప్పగించాలి
ABN , First Publish Date - 2020-11-21T06:08:10+05:30 IST
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ ఫారూఖ్ షుబ్లీ పేర్కొన్నారు.

అబ్దుల్ సలాం కేసును సీబీఐకు అప్పగించాలి
విజయవాడ సిటీ: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ ఫారూఖ్ షుబ్లీ పేర్కొన్నారు. తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ నిందితులకు బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ సలాం కుటుంబ సభ్యులను పరామర్శించిన తీరు భయపెట్టినట్టుగా, ప్రలో భాలకు గురి చేసేలా ఉందన్నారు. సలాం కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న పోలీసుల కాల్‌డేటాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.