నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-15T05:43:51+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన
గవర్నర్‌పేట, డిసెంబరు 14: రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని, కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరి వీడి ఆ చట్టాలను రద్దు చేయాలని మాజీమంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా సోమవారం స్థానిక రాజగోపాలాచారి వీధిలోని బకింగ్‌హాం పోస్టాఫీసు వద్ద రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన జరిగింది. రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, ఐద్వా నాయకులు స్వరూపరాణి, శ్రీదేవి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి.దుర్గాభవానీ, ఓర్సు దుర్గాంబ, సంఘాల నేతలు పోలారి, మోతుకూరి అరుణ్‌కుమార్, సయ్యద్ అప్సర్ తదితరులు పాల్గొన్నారు.