కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-03T06:47:00+05:30 IST
కౌలు కూడా కట్టలేనేమోననే మనస్థాపంతో కొత్తపేట గ్రామానికి చెందిన కౌలురైతు ముళ్లపూడి వెంకట కృష్ణయ్య (తాత) (62) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు.

అవనిగడ్డ టౌన్ : కౌలు కూడా కట్టలేనేమోననే మనస్థాపంతో కొత్తపేట గ్రామానికి చెందిన కౌలురైతు ముళ్లపూడి వెంకట కృష్ణయ్య (తాత) (62) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ముళ్లపూడి వెంకట కృష్ణయ్య మోదుమూడి సమీపంలో నాలుగెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తుండగా గత ఏడాది మినుములు నష్టపోగా, ఇటీవల వర్షాలకు కోతకు సిద్దంగా ఉన్న వరి మొత్తం పడిపోయి మొలకలు వచ్చేస్తూ ఉండటంతో చూసి తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకట కృష్ణయ్య కుటుంబాన్ని తెలుగుదేశం నేత మండలి వెంకట్రామ్, జనసేన నేత మండలి రాజేష్ పరా మర్శించారు. టీడీపీ నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, ముళ్లపూడి శ్రీను, జనసేన నేతలు బండ్రెడ్డి మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు. వెంకట కృష్ణయ్య ఆత్మహత్య తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మృతుని కుటుంబానికి పరిహారం అందిం చాలని డిమాండ్ చేశారు. వెంకట కృష్ణయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత డిమాండ్ చేశారు.