ఈ నెల 31 వరకు ఆర్టీసీ సర్వీసులు నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-23T09:46:46+05:30 IST

ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 31 వరకు ఆర్టీసీ సర్వీసులు నిలిపివేత

 ఆంధ్రజ్యోతి  - మచిలీపట్నం : ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా  రాష్టంలో నడిచే ఆర్జీసీ సర్వీసులతోపాటు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇతర రాష్టాలనుంచి వచ్చే బస్సులను మనరాష్ట్రంలోకి అనుమతించబోమన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచన  మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 


  ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌, ఆటోలను కూడా నడపకూడదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వస్తే ఆటో, లేదా వాహనంలో ఒక్కరినే తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు.  ఈ విషయంపై రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు చేశామని ఆయన చెప్పారు.  కరోనా కారణంగా ఎవ్వరూ మరణించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 

Updated Date - 2020-03-23T09:46:46+05:30 IST