రవాణా మంత్రితో ఆర్టీసీ ఎండీ భేటీ

ABN , First Publish Date - 2020-03-24T10:04:10+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ సోమవారం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నానిని ఆయన గృహంలో కలిశారు.

రవాణా మంత్రితో ఆర్టీసీ ఎండీ భేటీ

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ సోమవారం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నానిని ఆయన గృహంలో కలిశారు. లాక్‌డౌన్‌ కార ణంగా రవాణా శాఖలో నెలకొన్న పరిస్థితులను మంత్రికి ఆయన వివరిం చారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు చేయిం చడంతో పాటు రంగులు వేయించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సంస్థలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి, కార్మికులకు అవగాహన కల్పిం చాలని సూచించారు.


Read more