రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-26T06:14:50+05:30 IST

కారు - బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి గాయాలు

ముదినేపల్లి రూరల్‌  : కారు - బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేపల చెరువు కాపలాగా  నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం నుంచి వచ్చిన కుటుంబం చేవూరులో నివాసం ఉంటుంది. నక్కల వెంకటేష్‌ (25), అతని మామయ్య విజయ్‌ (55)ని శుక్రవారం మోటార్‌ సైకిల్‌ ఎక్కించుకుని గుడివాడ వెళ్తుండగా,  అత్తిమాను చెరువు సమీపంలో గుడివాడ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న విజయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని గుడివాడ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అతనిని విజయవాడ తరలించారు. ఎస్సై మణికుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-26T06:14:50+05:30 IST