రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2020-03-02T09:59:42+05:30 IST

రెవెన్యూ ఉద్యోగుల పెన్షన్‌ సెటిల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఏ ప్రసాద్‌ అన్నారు. స్థానిక టీచర్స్‌ గిల్డు హోమ్‌లో రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సదస్సులో డీఆర్వో ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రసంగించారు.

రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

మచిలీపట్నం టౌన్‌, మార్చి 1 : రెవెన్యూ ఉద్యోగుల పెన్షన్‌ సెటిల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఏ ప్రసాద్‌ అన్నారు. స్థానిక టీచర్స్‌ గిల్డు హోమ్‌లో రిటైర్డు రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సదస్సులో డీఆర్వో ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. రిటైర్డ్‌  రెవెన్యూ ఉద్యోగుల సలహాలు ఎంతో అవసరమన్నారు. పెన్షన్‌ సెటిల్‌ కాని స్పెషల్‌ కలెక్టర్‌ డీ సుదర్శన్‌, రిటైర్డు ఎమ్మార్వో ఎం భాస్కరరావుల సమస్యలను  కలెక్టర్‌ ఇంతియాజ్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. వివిధ శాఖల్లో రెవెన్యూ శాఖకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన అధికారుల సేవలను ఇప్పటికీ తలచుకుంటూనే ఉన్నామన్నారు. రిటైర్డు డిప్యూటీ కలెక్టర్‌ ఎంఏ గఫార్‌ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. రిటైర్‌ అయిన ఉద్యోగుల మెడికల్‌ బిల్లులు విజయవాడ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈబిల్లులు సత్వరం పాస్‌ చేసేందుకు డీఆర్వో ముందుకు రావాలన్నారు. 


సంఘ జిల్లా కార్యదర్శి గుడివాడ రామస్వామి మాట్లాడు తూ, ఇటీవల ఒక ఉద్యోగికి చెందిన లక్ష రూపాయల చెక్‌ కనబడలేదని, వీటిపై కోర్టుకు వెళ్లి తెచ్చుకున్నామన్నారు. ఈ సందర్భంగా రిటైర్డు ఎమ్మార్వో ఎస్‌ భాస్కరరావు కుమారుడు  శేషుకుమార్‌ తన తండ్రి పరిస్థితిని వివరించారు. అనారోగ్యంతో మంచాన తీసుకుంటున్నారని, పెన్షన్‌ సెటిల్‌ కాలేదని కన్నీరు మున్నీరై చెప్పారు.


రిటైర్‌ అధికారి ఏపీ పెన్షనర్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కె గోవిందరావు మాట్లాడుతూ, పలువురి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రిటైర్డు స్పెషల్‌ కలెక్టర్‌ సుదర్శనం తన సమస్యను వివరించారు. రిటైర్డు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వరరావు, జేఏసీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ సుబ్బారావు, కె నాగభూషణరావు, ఎండి సిలార్‌, విఎస్‌ఎస్‌ఎస్‌ రాజు, రాధాకృష్ణ, కోటంరాజు, శేషుకుమార్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు సింగయ్య, జోగేశ్వరరావు, సిహెచ్‌ రాంబాబు, కె గోవిందరావు, ఎంఏ గఫార్‌, గుడివాడ రామస్వామిలను ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2020-03-02T09:59:42+05:30 IST