మంత్రి కొడాలి నానికి వినతులు

ABN , First Publish Date - 2020-09-13T08:33:43+05:30 IST

గన్నీ బ్యాగ్స్‌ తయారీ దారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్‌ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. సెయింట్‌జాన్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు పెరికె

మంత్రి కొడాలి నానికి వినతులు

గుడివాడ : గన్నీ బ్యాగ్స్‌ తయారీ దారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్‌ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.  సెయింట్‌జాన్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు కలసి తమకు గన్నీబ్యాగ్స్‌ కాంట్రాక్ట్‌ దక్కేలా చూడాలని కోరగా, మంత్రి పై విధంగా బదులిచ్చారు.


కంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని ఎత్తివేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.భానుమూర్తి, ప్రధానకార్యదర్శి పి.పాండురంగవరప్రసాద్‌, ఎం.శ్రీనివాస్‌ మంత్రి కొడాలికి వినతిపత్రం అందజేశారు.   సీపీఎఎస్‌ రద్దుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి  హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-09-13T08:33:43+05:30 IST