-
-
Home » Andhra Pradesh » Krishna » reprsentation to central minister
-
జాతీయ రహదారులతో నూజివీడును అనుసంధానించండి
ABN , First Publish Date - 2020-12-28T06:03:37+05:30 IST
జాతీయ రహదారులతో నూజివీడును అనుసంధానించండి

నూజివీడు, డిసెంబరు 27: చెన్నై, కోలకతా, ఛత్తీస్‌ఘడ్ జాతీయ రహదారులకు నూజివీడును అనుసంధానం చేస్తూ లింకు రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పి.మురళీధరన్ హామీ ఇచ్చారు. ఆదివారం ఏలూరు వచ్చిన కేంద్రమంత్రిని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాయకులు బోను అప్పారావు, మాటూరి రవికాంత్ కలిసి లింకు రహదారుల నిర్మాణంపై వినతి పత్రం సమర్పించారు. మెట్ట ప్రాంతమైన నూజివీడులో మామిడి, జామ, పొగాకు, మొక్కజొన్న వాణిజ్య పంటలు పండిస్తున్న రైతాంగానికి లింకురోడ్ల నిర్మాణం మేలుచేస్తుందని మంత్రికి తెలిపారు. దీంతో పూర్తిగా వెనకబడి ఉన్న నూజివీడు పారిశ్రామికంగా, వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి కార్యాచరణకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.