జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు ఇవీ

ABN , First Publish Date - 2020-05-17T08:59:23+05:30 IST

మూడో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనుంది. మరిన్ని సడలింపులతో నాలుగో విడత లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు కేంద్ర

జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు ఇవీ

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

మూడో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనుంది. మరిన్ని సడలింపులతో నాలుగో విడత లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేడో, రేపో మార్గదర్శకాలను జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నమోదైన కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని జిల్లాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా నిర్ణయించే అధికారాన్ని, ఆంక్షల అమలుపై నిర్ణయాధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.


జిల్లాలో ఆదివారం నాటికి 367 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. వాటిలో 300 పైగా కేసులు విజయవాడ నగరంలోనే ఉండటంతో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొత్తాన్ని రెడ్‌జోన్‌గా గుర్తించారు. జిల్లాలో రెండో కార్పొరేషన్‌గా ఉన్న మచిలీపట్నం నగరంతోపాటు జగ్గయ్యపేట, నూజివీడు మున్సిపాలిటీలను కూడా రెడ్‌జోన్ల పరిధిలోకి తీసుకువచ్చారు. మండలాల విషయానికొస్తే.. జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్‌ మండలాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. 

     

ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు ఇవీ.. 

జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ, నందిగామ నగర పంచాయతీలతోపాటు నందిగామ రూరల్‌, చాట్రాయి, ముసునూరు, ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు మండలాలను ఆరెంజ్‌ జోన్లుగా గుర్తించారు. గుడివాడ, పెడన మున్సిపాలిటీలు, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీలతోసహా 43 మండలాలను గ్రీన్‌జోన్లుగా గుర్తించారు. వీటిలో ఎ.కొండూరు, ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, బాపులపాడు, చల్లపల్లి, చందర్లపాడు, చాట్రాయి, జి.కొండూరు, గంపలగూడెం, ఘంటసాల, గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు, గూడూరు, ఇబ్రహీంపట్నం, కైకలూరు, కలిదిండి, కంచికచర్ల, కోడూరు,  కృత్తివెన్ను, మచిలీపట్నం రూరల్‌, మండవల్లి, మోపిదేవి, మొవ్వ, ముదినేపల్లి, మైలవరం, నాగాయలంక, నందిగామ రూరల్‌, నందివాడ, నూజివీడు రూరల్‌, పామర్రు, పమిడిముక్కల, పెడన రూరల్‌, పెదపారుపూడి, పెనుగంచిప్రోలు, రెడ్డిగూడెం, తోట్లవల్లూరు, తిరువూరు రూరల్‌, ఉంగుటూరు, వత్సవాయి, వీరులపాడు, విస్సన్నపేట, ఉయ్యూరు రూరల్‌ మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. నాలుగో విడత లాక్‌డౌన్‌లో గ్రీన్‌జోన్లతోపాటు ఆరెంజ్‌ జోన్లలో కూడా కొన్ని సడలింపులతో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి.

Updated Date - 2020-05-17T08:59:23+05:30 IST