భద్రతా ప్రమాణాలు పాటించాలి: ఆర్డీవో
ABN , First Publish Date - 2020-08-11T09:30:48+05:30 IST
కొవిడ్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆర్డీవో ఎన్.ఎస్.కె.ఖాజావలి సూచించారు.

మచిలీపట్నం టౌన్ : కొవిడ్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆర్డీవో ఎన్.ఎస్.కె.ఖాజావలి సూచించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి, ఆంధ్రా ఆసుపత్రి, వరలక్ష్మీ పాలిటెక్నిక్ కొవిడ్ కేంద్రాలను ఆర్డీవోతో పాటు మండల కమిటీ సభ్యులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ, ఇన్చార్జి తహసీల్దార్ వనజాక్షి, విద్యుత్ శాఖాధికారులు తనిఖీ చేశారు. రోగులకు ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆసుపత్రి వర్గాలు, వైద్యులకు ఆర్డీవో సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరికీ వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.