కారు లోన్‌ ఇప్పిస్తామని దోపిడీ

ABN , First Publish Date - 2020-12-15T06:05:19+05:30 IST

సులభంగా డబ్బులు సంపాదించాలని తెలిసిన వ్యక్తి వద్దే బంగారపు ఆభరణాలు దోపిడీ చేసిన కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ కేవీవీఎల్‌ నాయుడు తెలిపారు.

కారు లోన్‌ ఇప్పిస్తామని దోపిడీ
కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ నాయుడు

  కైకలూరు, డిసెంబరు14 : సులభంగా డబ్బులు సంపాదించాలని తెలిసిన వ్యక్తి వద్దే బంగారపు ఆభరణాలు దోపిడీ చేసిన కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ కేవీవీఎల్‌ నాయుడు తెలిపారు. సోమవారం కైకలూరు పోలీ్‌సస్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన శనగపల్లి రవితేజ గుప్త తనకు తెలిసిన అదే ప్రాంతానికి చెందిన బండాతేజ్‌వంత్‌, బుంగా చింటులకు తన కారు పెట్టి లోన్‌ తీసుకోవాలని, తనకు అర్జెంటుగా రూ.3 లక్షలు కావాలని, గుంటూరులో కాకుండా మరోచోట ఎక్కడైనా పెడదామని చెప్పారు. వారు అప్పటికే అతనివద్ద ఉన్న నగదు, బంగారాన్ని చోరీ చేయాలని షేక్‌ ముహిద్దీన్‌, సత్తెనపల్లి శివశంకర్‌తో పథకం రచించారు. బుంగా చింటు స్వగ్రామం కైకలూరు మండలం పల్లెవాడ కావడంతో తనకు తెలిసిన వారు ఉన్నారని, కారుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోయినా రుణం ఇస్తారని చెప్పారు. దోపిడీ చేసేందుకు వీరి నలుగురితోపాటు చింటూ మరో ముగ్గురి సహకారాన్ని తీసుకున్నాడు. ఈనెల 10న రవితే జ గుప్తను పల్లెవాడకు రప్పించారు. అతనికారుపై దాడిచేసి కత్తులు, ఇనుప రాడ్లుతో బెదిరించి కారు అద్దాలు పగులగొట్టి అతని వద్ద నుంచి 4 కాసుల బంగారపు గొలుసు, ఉంగరం, వెండి ఉంగరం, ఒక ఐఫోన్‌, మరో ఫోను, ఖరీదైన వాచ్‌, ఇయర్‌ ఫోన్స్‌ను లాక్కువెళ్లారు.  రవితేజ గుప్త కైకలూరు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై టి.రామకృష్ణ కేసు నమోదు చేసి పలు బృందాలుగా వీడి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లోనే కేసును చేధించడం పట్ల సీఐ, గుడివాడ డీఎస్పీ సత్యానందం అభినందించారు.  

Updated Date - 2020-12-15T06:05:19+05:30 IST