కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి
ABN , First Publish Date - 2020-06-25T09:43:35+05:30 IST
వైద్యాధికారులు సమన్వయంతో పని చేసి కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ సిటీ, జూన్ 24: వైద్యాధికారులు సమన్వయంతో పని చేసి కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బంది, వైద్య సౌకర్యాలపై వైద్యాధికారులతో క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ కొవిడ్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు, డిశ్చార్జ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని, దీనికి ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు బాధ్యత వహించాలన్నారు.
ఇప్పటి వరకు 78,279 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ప్రతీరోజూ 3 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనికోసం 20 వైద్యబృందాలు, 10 ఐమాస్క్ బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జేసీ ఎల్.శివశంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రమేష్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య పాల్గొన్నారు.