వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2020-12-15T05:50:50+05:30 IST

వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల నిరసన

వేతనాలు చెల్లించాలని పారిశుధ్య కార్మికుల నిరసన
ఆందోళన చేస్తున్న కార్మికులు

నందిగామ రూరల్‌, డిసెంబరు 14: పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నందిగామ పారిశుధ్య కార్మికులు సోమవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆరు నెలలుగా పెండింగ్‌లోని హెల్త్‌ అలవెన్స్‌లు, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చనుమోలు సైదులు, కటారపు గోపాల్‌ డిమాండ్‌ చేశారు.



Updated Date - 2020-12-15T05:50:50+05:30 IST