మండల కేంద్రాన్ని తరలిస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2020-12-07T06:25:19+05:30 IST

మండల కేంద్రమైన వీరులపాడు ను తరలిస్తే ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని మండల పోరాట కమిటీ సభ్యులు వట్టికొండ చంద్ర మోహన్‌, వాసిరెడ్డి రమేష్‌ పేర్కొ న్నారు.

మండల కేంద్రాన్ని తరలిస్తే ఊరుకోం

వీరులపాడు, డిసెంబరు 6 : మండల కేంద్రమైన వీరులపాడు ను తరలిస్తే ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని మండల పోరాట కమిటీ సభ్యులు వట్టికొండ చంద్ర మోహన్‌, వాసిరెడ్డి రమేష్‌ పేర్కొ న్నారు. ఆదివారం వీరులపా డులో ఆయా రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల క్రితం మండల కేంద్రంగా ఆవిర్భవించిన వీరులపాడు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. ఎంతో మంది దాతలు 17 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చా రన్నారు. కొందరి స్వార్థం కోసం ఎమ్మెల్యేని పక్కదోవ పట్టిస్తూ మండల కేం ద్రాన్ని తరలించేందుకు పూనుకోవటం సరైంది కాదన్నారు. జుజ్జూరును పారి శ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసి, వీరులపాడును మండల కేంద్రంగానే ఉంచా లన్నారు. కొణతాలపల్లికి చెందిన నండ్రు తిరుపతిరావు మాట్లాడుతూ నియోజ కవర్గం ఎస్సీగా ఉందంటే ఇక్కడ అధికంగా ఉన్న ఎస్సీలే కారణమన్నారు. కమి టీ సభ్యులు గువ్వల సత్యనారాయణ, దొడ్డా వాసు, నిమ్మల రాజేంద్ర, కోడూరి పిచ్చేశ్వరరావు, పుల్లయ్య, అల్లూ వెంకటేశ్వరరెడ్డి, పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T06:25:19+05:30 IST