బ్యారేజ్‌లపై బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2020-09-20T09:36:03+05:30 IST

ప్రకాశం బ్యారేజ్‌ దిగువన కొత్తగా నిర్మించ తలపెట్టిన రెండు బ్యారేజ్‌లపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని, ఈ ప్రాజెక్ట్‌ల

బ్యారేజ్‌లపై బహిరంగ చర్చకు సిద్ధం

 విపక్షాలకు సవాలు విసిరిన ఎమ్మెల్యే సింహాద్రి


అవనిగడ్డ టౌన్‌: ప్రకాశం బ్యారేజ్‌ దిగువన కొత్తగా నిర్మించ తలపెట్టిన రెండు బ్యారేజ్‌లపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని, ఈ ప్రాజెక్ట్‌ల గురించి బహిరంగ చర్చకు తాను సిద్ధమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు సవాల్‌ విసిరారు. శనివారం అవనిగడ్డ వైసీపీ కార్యాలయం వద్ద జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యారేజీల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని అవనిగడ్డ నియోజకవర్గం క్షారమయంగా మారిపోతుందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 


బ్యారేజీల నిర్మాణం జరిగితే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఏడు నియోజకవర్గాలకు తాగు, సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని, ఈ విషయంలో ఏమైనా అనుమానాలున్నా తాను బహిరంగ చర్చలో నివృత్తి చేసేందుకు సిద్ధమని ఎమ్మెల్యే తెలిపారు. 

Updated Date - 2020-09-20T09:36:03+05:30 IST