పీఎస్‌ తెలుగు యూనివర్సిటీ మాజీ కౌన్సిల్‌ సభ్యుడు ప్రసాదరావు మృతి

ABN , First Publish Date - 2020-12-27T06:06:15+05:30 IST

కూచిపూడి మాజీ సర్పంచి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కౌన్సిల్‌ సభ్యుడు ప్రసాదరావు అనారోగ్యంతో విజయవాడలో ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందారు.

పీఎస్‌ తెలుగు యూనివర్సిటీ   మాజీ కౌన్సిల్‌ సభ్యుడు ప్రసాదరావు మృతి

కూచిపూడి, డిసెంబరు 26 : కూచిపూడి మాజీ సర్పంచి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ కౌన్సిల్‌ సభ్యుడు  ప్రసాదరావు అనారోగ్యంతో విజయవాడలో ఒక ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందారు. కూచిపూడి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. కూచిపూడి, పెదపూడి గ్రామస్థులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.


Updated Date - 2020-12-27T06:06:15+05:30 IST