నష్ట అంచనాలో కౌలు రైతుల్ని విస్మరిస్తే ఆందోళనే

ABN , First Publish Date - 2020-12-13T06:04:53+05:30 IST

జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా నివర్‌ తుఫాను కారణంగా 90 శాతం పంట దెబ్బతింటే వ్యవసాయాధికారులు మాత్రం లక్షా 8వేల ఎకరాలకే పంట నష్టం అంచనాలు ఎలా వేశారని తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు కామినేని శ్రీరామకృష్ణ ప్రసాద్‌ విమర్శిచారు.

నష్ట అంచనాలో కౌలు రైతుల్ని విస్మరిస్తే ఆందోళనే

ప్రభుత్వానికి తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు కామినేని హెచ్చరిక

 గుడివాడటౌన్‌, డిసెంబరు 12 : జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా నివర్‌ తుఫాను కారణంగా 90 శాతం పంట దెబ్బతింటే వ్యవసాయాధికారులు మాత్రం లక్షా 8వేల ఎకరాలకే పంట నష్టం అంచనాలు ఎలా వేశారని తెలుగు రైతు జిల్లా ఉపాధ్యక్షుడు కామినేని శ్రీరామకృష్ణ ప్రసాద్‌ విమర్శిచారు. స్థానిక గౌరీశంకరపురంలోని తన నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబరు 15వ తేదీన పంట నష్టం అంచనా వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. లక్షా 8వేల ఎకరాలు కాక మరో 30వేల ఎకరాల్లో పంటకు సంబంధించిన పనలు నీటిలో తేలడం గుర్తించారనీ, క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు లెక్కలు తీయలేదని అన్నారు. మరో లక్ష ఎకరాల్లో వరిపంట నీటమునిగిందని, దీనిలో 70 శాతం మంది కౌలుదార్లు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులకు సంబంధించిన పంట నష్టం అంచనాలు గుర్తించకుంటే కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


Updated Date - 2020-12-13T06:04:53+05:30 IST