మంత్రిపై పోస్టులు తీసేయండి.. లేదంటే చంపేస్తా!

ABN , First Publish Date - 2020-09-25T16:02:32+05:30 IST

హిందూ ధర్మం, దేవుళ్లపై పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు..

మంత్రిపై పోస్టులు తీసేయండి.. లేదంటే చంపేస్తా!

మంత్రి మేనల్లుడినంటూ చిత్తూరు జిల్లా వ్యక్తికి బెదిరింపు


గుడివాడ : హిందూ ధర్మం, దేవుళ్లపై పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. దీనిపై సదరు వ్యక్తికి మంత్రి కొడాలి మేనల్లుడినంటూ ఓ వ్యక్తి ఫోన్‌చేశారు. ఆ పోస్టులను వెంటనే డిలీట్‌ చేయాలని.. లేదంటే చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. రాయలేని దుర్భాషలాడుతూ పోస్టులు వెంటనే తొలగించకపోతే చంపివేస్తానని గుడివాడ నుంచి అతడు బెదిరించినట్లు బయటకు వచ్చిన ఫోన్‌ రికార్డింగ్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే మంత్రి మేనల్లుడు ఇక్కడ లేరు. అమెరికాలో ఉన్నత చదువులు చదువు కుంటున్నారు. మరి ఆయన మేనల్లుడినంటూ బెదిరించింది ఎవరా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.Updated Date - 2020-09-25T16:02:32+05:30 IST