వలంటీర్లు చేసిన పని చూసి.. అవాక్కైన పోలీసులు

ABN , First Publish Date - 2020-04-01T09:34:50+05:30 IST

రేషన్‌ షాపుల వద్ద రద్దీ, సర్వర్‌ సమస్యల..

వలంటీర్లు చేసిన పని చూసి.. అవాక్కైన పోలీసులు

చౌక డిపోల వద్ద పోలీసు పర్యవేక్షణ

రేషన్‌ డిపోల వద్ద తగ్గని రద్దీ

అవే సర్వర్‌ సమస్యలు

బారులు తీరిన జనాలు 

సంతకాలు చేయించి నిత్యావసరాల పంపిణీ చేయించిన పోలీసులు 

వలంటీర్ల నిర్లక్ష్యం.. వారికి  పోలీస్‌ క్లాస్‌ !


విజయవాడ(ఆంధ్రజ్యోతి): రేషన్‌ షాపుల వద్ద రద్దీ, సర్వర్‌ సమస్యల కారణంగా ప్రజలు పడిగాపులు పడుతుండటంతో జిల్లావ్యాప్తంగా మంగళవారం పోలీసులు రంగంలోకి దిగారు. చాలాచోట్ల డిపోల వద్ద భౌతిక దూరం పాటించడానికి సర్కిళ్లు వేయకపోవడంతో పోలీసులు  అసహనం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల గ్రామ వలంటీర్ల నిర్లక్ష్యమే దుకాణాల వద్ద రద్దీకి కారణమని పోలీసులు అంచనాకు వచ్చారని తెలుస్తోంది. రేషన్‌ షాపుల వద్ద సర్కిల్స్‌ వేయాల్సిందిగా ప్రభుత్వం సున్నం బస్తాలను కూడా పంపించింది. చాలాచోట్ల వీటిని అలా వదిలేశారు. ఓపెన్‌ చేయకుండా వదిలేశారు. కొంతమంది వలంటీర్లు కర్రతో సర్కిల్స్‌ గీయటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇలాచేస్తే క్రమశిక్షణ వస్తుందా అని పలుచోట్ల వలంటీర్లపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సమన్వయంతో వ్యవహరించాలి

గ్రామంలో సగటున పది నుంచి పదిహేనుమంది వలంటీర్లు ఉంటారు. కనీసం రెండు చౌక దుకాణాలు ఉంటాయి. ఒక్కో దుకాణానికి కనీసం ఏడుగురు చొప్పున వలంటీర్లు ఉంటారు. గ్రామంలోని వలంటీర్లు అంతా మాట్లాడుకుని ఒక్కో రోజు ఒక్కో వలంటీర్‌ తమ పరిధిలోని కార్డుదారులను మాత్రమే తీసుకు రాగలిగితే ఎక్కడా రద్దీ కనిపించేది కాదని పోలీసులు అభిప్రాయపడ్డారు. దాదాపు అన్నిచోట్ల ఈ- పోస్‌లు సర్వర్ల సమస్య కారణంగా నిదానంగా స్పందిస్తున్నాయని పోలీసులు గుర్తించారు.


ధరల అదుపుపై దృష్టి

విజయవాడ సిటీ, మార్చి 31 :  జేసీ అధ్యక్షతన ధరల నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్తకులతో సంప్రదించి, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలను నిర్ధారించారని, వారం పాటు ఇవే ధరలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సంచార రైతు బజార్లల్లో నిర్ధారించిన వాటికంటే 10 శాతం ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అధిక ధరలకు విక్రయిస్తే 1800 425 4402 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.


నిత్యావసరాలు (కిలో) ధర(రూ.)

బియ్యం-సోనామసూరి 47.00

బియ్యం-బీపీటీ 40.00

కందిపప్పు-లోకల్‌ 90.00

కందిపప్పు-అకోల 100.00

పెసరపప్పు 115.00

మినప్పప్పు 118.00

శెనగపప్పు 65.00

గోదుమపిండి 35.00

గోదుమరవ్వ 45.00

పంచదార 42.00

పామాయిల్‌ 89.00

పామాయిల్‌ 88.00

సన్‌ప్లవర్‌ ఆయిల్‌ 100.00

సన్‌ప్లవర్‌ ఆయిల్‌ 95.00

వేరుశనగనూనె 138.00

వేరుశనగనూనె 129.00

కూరగాయలు ధర(రూ.)

టమోటా 14.00

వంకాయలు 18.00

బెండకాయలు 20.00

పచ్చిమిర్చి 14.00

కాకరకాయ 20.00

బీరకాయ 34.00

క్యాబేజి 12.00

క్యారెట్‌ 35.00

దొండకాయలు 20.00

బంగాళాదుంపలు 28.00

ఉల్లిపాయలు 30.00

దోసకాయలు 16.00


Updated Date - 2020-04-01T09:34:50+05:30 IST