స్వచ్ఛతే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలి
ABN , First Publish Date - 2020-03-02T10:04:49+05:30 IST
పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని స్వచ్ఛ చల్లపల్లి రథఽ సారథులు డాక్టర్ డీఆర్.కె.ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి పేర్కొన్నారు.

యార్లగడ్డ(చల్లపల్లి), మార్చి 1: పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతే ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలని స్వచ్ఛ చల్లపల్లి రథఽ సారథులు డాక్టర్ డీఆర్.కె.ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి పేర్కొన్నారు. స్వచ్ఛ కార్యక్ర మాలపై ప్రజల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆదివారం తెల్లవారు జామున స్వచ్ఛతా నడక సభ్యుల బృందం చల్లపల్లిలో స్వచ్ఛతా నడక ప్రారంభించారు. పురిటిగడ్డ వద్ద స్వచ్ఛ యార్లగడ్డ కన్వీనర్ తూము వెంకటేశ్వరరావు, కార్యదర్శి హరీష్‌ల ఆధ్వర్యంలో మరో 70 మంది స్వచ్ఛ యార్లగడ్డ కార్యకర్తలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలుకగా, యార్లగడ్డ వరకూ ఎనిమిది కిలోమీటర్ల మేర స్వచ్ఛతా నడక కొనసాగింది.
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 152 రోజుల స్వచ్ఛ యార్లగడ్డ కార్యక్రమాలను కన్వీనర్ వెంకటేశ్వ రరావు స్వచ్ఛ బృందానికి చూపించారు. డీ.ఆర్.కె.దంపతులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ నిషేధం, చేతిసంచుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. మండవ బాలవర్థిరావు, రత్నబాబు, ప్రాతూరి శాస్త్రి, కోటేశ్వరరావు, వై.వి.ఆర్.ప్రసాద్, ధర్మారావు, బొబ్బా యుగంధరరావు, వెంకటేశ్వరరావు, అట్లూరి రంగారావు పాల్గొన్నారు.