చేపల మార్కెట్‌కు మోకా పేరు : మంత్రి పేర్ని

ABN , First Publish Date - 2020-07-14T10:08:44+05:30 IST

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు చేసిన..

చేపల మార్కెట్‌కు మోకా పేరు : మంత్రి పేర్ని

మచిలీపట్నం టౌన్‌ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు చేసిన సేవలు మరువలేనివని మంత్రి పేర్ని నాని అన్నారు. మోకా భాస్కరరావు సంస్మరణ సభ సోమవారం ఉల్లింగిపాలెంలో జరిగింది. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలార్‌దాదా అధ్యక్షత వహించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మోకా భాస్కరరావు పేరును  చేపల మార్కెట్‌కు పెడుతున్నామన్నారు. ఉల్లింగిపాలెం ఫ్రధాన కూడలిలో భాస్కరరావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నడకుదిటి వెంకటేశ్వరరావు, ఎల్‌.వెంకటేశ్వరరావు, వాలిశెట్టి రవిశంకర్‌, శ్రీకాకుళపు నాగేశ్వరరావు, మాదివాడ రాము పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T10:08:44+05:30 IST