సంయమనం పాటించాలి

ABN , First Publish Date - 2020-03-27T09:08:43+05:30 IST

ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా సంయమనం పాటిం చాలని మంత్రి పేర్ని నాని పిలుపుని చ్చారు.

సంయమనం పాటించాలి

మచిలీపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా సంయమనం పాటిం చాలని మంత్రి పేర్ని నాని పిలుపుని చ్చారు. మచిలీపట్నంలో గురువారం ఆయన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రెవె న్యూ అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కోనేరు సెంటరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్ర జా శ్రేయస్సు కోసమే పోలీసులు కొంత కఠినంగా ఉంటున్నారన్నారు. బాధ్యతతో మెలగాల్సిన కొందరు పోలీసులతో వాగ్వా దానికి దిగడం, రోడ్లపైకి రావడం ధర్మం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యను క్రికెట్‌ స్కోరు చూసినట్లుగా చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట చెక్‌పోస్టు వద్ద మీడియా ముందు కొందరు మాట్లా డిన తీరు బాధాకరమన్నారు.


ఇక్కడి ప్రభుత్వం తమను గుంపులు, గుంపులు గా నిలబెట్టిందని, పోలీసులు చెక్‌పోస్టు వద్ద తమను నిలిపివేశారని చెబుతున్నా రని.. హైదరాబాద్‌లో పత్రాలు తీసుకుని ఇంటికి బయల్దేరినపుడు కరోనా సోకు తుం టదని చదువుకున్న వారికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించేందుకు  అధికారు లు, పోలీసులు, పాత్రికేయులు నిత్యం పనిచేస్తున్నారని, వారి సేవలు వెలకట్టలే నివన్నారు. వైరస్‌ నివారణ చర్యల్లో భా గంగా ఇంటింటి సర్వే చేస్తున్న వలంటీ ర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.కొత్తగా ఎవరైనా వస్తే వారి సమాచారం వెంటనే ఇవ్వాలని.. అలాం టివారు స్వీయ నియంత్రణలోనే ఉండాలని. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసు నమోదు చేసి ఆస్ప్రతులకు పంపు తామని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వే లో వలంటీర్లు ప్రజలతో పరుషంగా మాట్లాడవద్దని, గుర్తింపు కార్డులు వెంట తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-03-27T09:08:43+05:30 IST