-
-
Home » Andhra Pradesh » Krishna » pending salaries agitation
-
16 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2020-12-15T05:49:22+05:30 IST
16 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలి

విజయవాడ సిటీ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయితీల్లో పనిచేసే స్కూల్ స్వీపర్లు, గ్రీన్ అంబాసిడర్లు (స్వచ్ఛ భారత్) 16 నెలల నుంచి వేతనాలు లేకుండా పనిచేయాలా? అని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికులకు వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో సోమవారం ఆందోళన నిర్వహించారు. రవీంద్రనాథ్ మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పని భద్రతతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రాధాకృష్ణమూర్తి ప్రసంగించారు. గ్రీన్ అంబాసిడర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీరాములు, స్కూల్ స్వీపర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.