పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-25T06:45:54+05:30 IST

భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

పాండురంగస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పాండురంగ స్వామి దేవాలయం

మచిలీపట్నం టౌన్‌ : భక్తుల కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గోపూజ కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ సిద్ధంగా గురుపూజ కార్యక్రమాలు ఆలయ అర్చకులు టేకి నరసింహం దంపతులు నిర్వహించారు. టేకి గంగాధరం ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆలయం పాండురంగ నామంతో మార్మోగింది. కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఆలయంలో భక్తులు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.  


Read more