‘పైడిమర్రి’ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం హర్షణీయం

ABN , First Publish Date - 2020-08-17T13:56:59+05:30 IST

‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు..

‘పైడిమర్రి’ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం హర్షణీయం

తిరువూరు(కృష్ణా): ‘భారతదేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై జన విజ్ఞానవేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఆరో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పైడిమర్రి జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చారన్నారు. జేవీవీ సభ్యులు హరికృష్ణ, రాంప్రదీప్‌, గంగాధర్‌,  రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రఘునంథన్‌ హర్షం వ్వక్తం చేశారు.


Updated Date - 2020-08-17T13:56:59+05:30 IST