పండించినోడే.. తొక్కించేశాడు!

ABN , First Publish Date - 2020-12-10T05:38:20+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందొచ్చే సమయాన నివర్‌ తుఫానుకు నీటముంచింది.

పండించినోడే.. తొక్కించేశాడు!

గుడ్లవల్లేరు, డిశంబర్‌ 9 : ఆరుగాలం  కష్టపడి పండించిన పంట చేతికి అందొచ్చే సమయాన నివర్‌ తుఫానుకు నీటముంచింది. పైరును కోస్తే కోత కూలి కూడా రాదని భావించిన కౌలురైతు కష్టమైనా, నష్టమైనా బాధను దిగమింగుతూ ట్రాక్టర్‌తో తొక్కించేశాడు. గుడ్లవల్లేరు గ్రామంలో సిద్ధేశ్వరస్వామి ఆలయ దేవుని మాన్యం 8 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు గ్రామానికి చెందిన తుమ్మల అనిల్‌. ప్రభుత్వం సిఫార్సు చేసిన 1162 రకం వరి వంగడాన్ని ఊడ్చిన అనిల్‌ చీడపీడల బాధలను అధిగమిస్తూ పంటను పండించాడు. మరో వారంలో కోత కోయించే సమయానికి నివర్‌ తుఫాను ఆ కౌలురైతు ఆశలపై నీళ్లు కురిపించింది. కురిసిన వర్షాలు ఒక ఎతైతే వర్షాలు ఆగినా పడిపోయిన చేలో నీరు 15 రోజులకూ తగ్గకపోవడంతో పండించిన పంట అంతా నీటిలో నాని దెబ్బతిన్నది. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకే ఈ దుస్థితి దాపురించిందని, చేతికి చిల్లిగవ్వ కూడా వచ్చేపరిస్థితి లేకే తొలగిస్తున్నాననీ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.   


Updated Date - 2020-12-10T05:38:20+05:30 IST