150 ఎకరాల్లో పంటను దున్నేస్తున్న రైతన్న!

ABN , First Publish Date - 2020-11-25T06:38:06+05:30 IST

ఆరుగాలం కష్టించినా ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో కోతకోయాల్సిన వరి పంటను రైతులు దున్నేస్తు న్నారు.

150 ఎకరాల్లో పంటను దున్నేస్తున్న రైతన్న!
పెడన మండలంలో పంటను ట్రాక్టర్‌తో దున్నేస్తున్న రైతులు

పెడన రూరల్‌ :  ఆరుగాలం కష్టించినా ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో కోతకోయాల్సిన వరి పంటను రైతులు దున్నేస్తు న్నారు. ఈ  పరిస్థితి పెడన మండలంలోని పాత బల్లిపర్రు, మడక ప్రాంతాల్లో మంగళవారం కన్పించింది. దాదాపు 150 ఎకరాలలో కోత కొచ్చిన వరిచేలను ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. అధిక వర్షాలకు తోడు మురుగు బయటకు పోయే పరిస్థితి లేక వరి పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరాకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేయగా,  కోత కోసినా ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు. కోత కోసి నూరిస్తే ఎకరాకు ఐదు వేల రూపా యలు ఖర్చు అవుతుంది. ఐదు బస్తాల ధాన్యం దిగుబడి రాని దుస్థితి. అందుకే దున్నేసి  దాళ్వాకు సన్నద్ధం చేస్తున్నామని రైతులు తెలిపారు. 


Updated Date - 2020-11-25T06:38:06+05:30 IST