రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T06:06:25+05:30 IST

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ఉంగుటూరు, డిసెంబరు 29 : నివర్‌ తుఫానుకు రంగుమారి, పాయవచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉంగుటూరు మండల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డయల్‌ యువర్‌ జేసీ కార్యక్రమంలో ఇటీవల ఉంగుటూరు మాజీసర్పంచ్‌, రైతు కాటూరి వరప్రసాద్‌ ఫోన్‌లో దెబ్బతిన్న ధాన్యం గురించి జేసీ మాధవీలతకు వివరించగా స్పందించిన ఆమె జిల్లాపౌరసరఫరాలశాఖ సాంకేతిక విభాగం నిపుణులను శాంపిల్స్‌ ఎనాలసిస్‌ కోసం మంగళవారం పొణుకుమాడు ఆర్బీకేకు పంపించారు.  సివిల్‌సప్లయ్‌ టెక్నికల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.వినోద్‌బాబు రైతుల సమక్షంలో ఆయా నమూనాలను విశ్లేషించారు. తుదినివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-30T06:06:25+05:30 IST