రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న నిరసనలు

ABN , First Publish Date - 2020-03-12T10:07:04+05:30 IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేంతవరకు తాము వెనడుగు వేసేది లేదని రాజధాని రైతులు తేల్చి చెప్పారు. అప్పటివరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తామన్నా రు.

రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న నిరసనలు

తుళ్లూరులో రైతులు అర్ధనగ్న ప్రదర్శన 

ఎండలో రాయపూడి మహిళల నిరసన

86వ రోజూ  ఉద్యమ హోరు  


అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేంతవరకు తాము వెనడుగు వేసేది లేదని రాజధాని రైతులు తేల్చి చెప్పారు. అప్పటివరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తామన్నా రు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతి రేకి స్తూ తుళ్లూరు, మందడంలో మహా ధర్నాలను కొనసాగించారు. రైతులు ఎండలో నిలుచుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమలో తమకు కులాల కుంపట్టు పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 


రానున్న స్థానిక ఎన్నికల్లో మీ ఓటు తో పాటు జై అమరావతి అనే స్లిప్‌ని పెట్టి బ్యాలెట్‌ బాక్స్‌లో వేయం డి అంటూ ఐదుకోట్ల ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు రాజధాని రైతులు, రైతు కూలీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తుళ్లూరులో రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. 


గుంటూరు, తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ, మార్చి 11: మూడు రాజధానుల ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా బుధవారం 86వ రోజు రాజధాని ప్రాంత రైతులు ఉద్యమహోరు కొనసాగించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడంలో మహాధర్నాలను 

నిర్వహించారు.   వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, తాడికొండ అడ్డరోడ్డు, పెద పరిమి తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మధ్యాహ్నం ఎండలో నిలుచుని  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయపూడి మహిళలు మండుటెండలో కూర్చొని నిరసనలు తెలిపారు. వైదిక ఆశ్రమం నేతృత్వంలో అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ యజ్ఞం నిర్వహించారు. మందడం దీక్షాశిబిరంలో మహిళలు  సామూహిక మణిద్వీపవర్ణన పూజ జరిపారు.మహిళలు చేస్తున్న న్యాయపోరాటానికి సంఘీభావం తెలపుతూ విజయవాడ శివకవి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


 

మూడు రాజధానులంటూ పోటీ ఆందోళనలు నిర్వహించడం తగదని మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. తుళ్లూరులో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ నేతలు తెనాలి, మంగళ గిరి నుంచి రోజుకు రూ.300 - రూ.500 ఇచ్చి జనాలను తీసుకొచ్చి పెయిడ్‌ ఉద్యమాలు చేయించటం దారుణమన్నారు. కమలానంద భారతి మాట్లాడుతూ అమరావతితోనే రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. ానున్న స్థానిక ఎన్నికల్లో మీ ఓటు తో పాటు జై అమరావతి అనే స్లిప్‌ని పెట్టి బ్యాలెట్‌ బాక్స్‌లో వేయం డి అంటూ ఐదుకోట్ల ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకు రాజధాని రైతులు, రైతు కూలీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తుళ్లూరులో రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. 

Updated Date - 2020-03-12T10:07:04+05:30 IST