రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి, ఎనిమిది మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-03-15T10:26:41+05:30 IST

కంచికచర్ల - పరిటాల గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో విద్యార్ధిని

రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి, ఎనిమిది మందికి గాయాలు

కంచికచర్ల రూరల్‌, మార్చి 14: కంచికచర్ల -  పరిటాల గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో విద్యార్ధిని మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం పరిటాల, నక్కలంపేట గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు  కంచికచర్ల పట్టణంలోని రవీంద్ర భారతి పాఠశాలలో చదువుతున్నారు. ప్రతి రోజూ విద్యార్థులు ఉదయం ఆటోలో వచ్చి సాయంత్రం తిరిగి వెళుతుంటారు.


పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నందున శనివారం ముందుగానే ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు రావాలనుకున్నారు. మధ్యాహ్న సమయంలో ఆరుగురు విద్యార్థులు  ఆటోలో బయలుదేరారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలో ముందు వెళుతున్న  బస్సును, మరో ఆటోను అధిగమించేందుకు ఆటో డ్రైవర్‌ పురమా రామారావు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి ఆటోను షడన్‌గా కుడి వైపు తిప్పాడు. దాంతో బస్సు, ఆటో ఢీకొన్నాయి.


ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థిని అత్లఊరి సంజన (16) అక్కడికక్కడే మృతిచెందింది. పదో తరగతి విద్యార్థులు మాగంటి హర్షిత,  షేక్‌ ముక్బల్‌, గణపనేని అనీష్‌, తొమ్మిదో తరగతి విద్యార్థినీలు గణపనేని చరితశ్రీ,  మాగంటి శ్రీవల్లి గాయపడ్డారు. వారిని స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేయించారు.  హర్షిత, చరితశ్రీ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి, ముక్బల్‌, అనీష్‌లను నందిగామ ఆసుపత్రులకు తరలించారు.  డ్రైవర్‌  రామారావు మితివమీరన వేగం, నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు చెపుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-15T10:26:41+05:30 IST