బావిలో పడిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-11-14T00:37:20+05:30 IST
ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలిని గూడూరు పోలీసులు బయటకు తీసి ఆమె ప్రాణాలు కాపాడారు.
గూడూరు, నవంబరు 12 : ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలిని గూడూరు పోలీసులు బయటకు తీసి ఆమె ప్రాణాలు కాపాడారు. దాసంశెట్టి సావిత్రి (70) గూడూరు టెలిఫోన్ ఎక్చ్సేంజ్ సమీపంలో ఒంటరిగా ఉంటోంది. నీరు తోడుకు నేందుకు బావి వద్దకు వెళ్లిన ఆమె బుధవారం రాత్రి బావిలో పడిపోయింది. అటుగా వెళ్లిన కరీముల్లా అనే వ్యక్తి కేకలు విని బావిలోకి టార్చిలైటు వేసి చూడగా అందులో వృద్దురాలు పడిఉంది. వెంటనే అతను 100 నెంబరుకు సమాచారం అందించాడు. సమీపంలో విధుల్లో ఉన్న కానిస్టబుళ్లు శివ కుమార్, శ్యామ్ వచ్చి స్థానికుల సాయంతో సావిత్రిని బయటకు తీసుకు వచ్చారు. వృద్దురాలి ప్రాణాలు కాపాడిని కానిస్టేబుళ్లకు స్థానికులు కృతజ్ఞత లు తెలియజేశారు.