ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2020-07-10T17:42:05+05:30 IST
అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తేలప్రోలులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధుడు రోజూ సాయంత్రం చుట్టుపక్కల పిల్లలను ఆటలు ఆడిస్తూ,

ఉంగుటూరు( కృష్ణా): అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తేలప్రోలులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధుడు రోజూ సాయంత్రం చుట్టుపక్కల పిల్లలను ఆటలు ఆడిస్తూ, కథలు చెబుతూ చనువుగా మెలిగేవాడు. సోమవారం సాయంత్రం ఐదేళ్ల చిన్నారిని ఆటలు ఆడిస్తూ పక్కనే ఉన్న ఇసుక గుట్ట దగ్గరకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. వృద్ధుడి చేష్టలను గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు చెప్పారు. బాలికపై అత్యా చారయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వి.శ్రీనివాసరావు అతడిపై ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈస్ట్ ఏసీపీ ఎం.రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.