బీసీలను చైతన్యం చేసింది ఎన్టీఆర్ మాత్రమే: మంత్రి కొడాలి నాని
ABN , First Publish Date - 2020-11-03T15:52:51+05:30 IST
బీసీలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన..
విజయవాడ: బీసీలను రాజకీయంగా చైతన్యవంతం చేసిన వ్యక్తి ఒక్క ఎన్టీఆరేనని, మంత్రి కొడాలి నాని అన్నారు. సినీరంగంలో బీసీలు తన వెంటే ఉన్నారని గ్రహించి పార్టీని స్థాపించి వారికి ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నూతనంగా నియమితులైన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ధాపించిన టీడీపీలో దొంగలు చేరి వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు బీసలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. బీసీలకు ఎన్టీఆర్ లేని లోటును వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తీర్చారన్నారు.