ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలి
ABN , First Publish Date - 2020-11-25T06:32:34+05:30 IST
మచిలీపట్నం ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం
అవనిగడ్డటౌన్, నవంబరు 24 : జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఎన్నికల ప్రచారంలో వాగ్దా నం చేసిన సీఎం జగన్ మాట తప్పారని టీడీపీ నాయకులు విమర్శించారు. అవనిగడ్డ వంతెన సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లాను రెండుగా విభజించేక్రమంలో ఒక దానికి మచిలీపట్నం జిల్లా అని, రెండో దానికి విజయవాడ జిల్లా అని ప్రతిపాదనలు పంపడం దారుణమన్నారు. తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన ఎన్టీరామారావు పుట్టిన ప్రాంతం ఉన్నందున మచిలీపట్నం ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కొల్లూరి వెంకటే శ్వరరావు, మండలి రామ్మోహన్ రావు, గాజుల మురళీకృష్ణ, విశ్వనాథుని మురళీమోహనరావు, పుల్లగోరు రాజేంద్రరావు, పులిగడ్డ నాంచారయ్య, బర్మా శ్రీను, మెగావతు గోపి, ఉద్దండి రామారావు, తదితరులు పాల్గొన్నారు.