-
-
Home » Andhra Pradesh » Krishna » nivar cyclone AP
-
రానున్న 6 గంటల్లో తీవ్ర తుపానుగా ‘నివర్’
ABN , First Publish Date - 2020-11-25T18:30:25+05:30 IST
రాగల 6 గంటల్లో నివర్ తుపాను...అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు ఏపీ విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

అమరావతి: రాగల 6 గంటల్లో నివర్ తుపాను...అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు ఏపీ విపత్తు నిర్వాహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. కడలూర్‌కు తూర్పు ఆగ్నేయం 240 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు , చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కె.కన్నబాబు సూచనలు చేశారు.