నూతన బోధనా పద్ధతులపై పట్టుసాధించాలి

ABN , First Publish Date - 2020-12-06T06:03:48+05:30 IST

నూతన బోధ నా పద్ధతులపై అధ్యాపకులు పట్టు సాధిం చాలని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి అకడమిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మెద్యూ శ్రీరంగం అన్నారు.

నూతన బోధనా పద్ధతులపై పట్టుసాధించాలి

నూతన బోధనా పద్ధతులపై పట్టుసాధించాలి

వన్‌టౌన్‌, డిసెంబరు 5 : నూతన బోధ నా పద్ధతులపై అధ్యాపకులు పట్టు సాధిం చాలని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి అకడమిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మెద్యూ శ్రీరంగం అన్నారు. కొత్తపేటలోని కేబీఎన్‌ కళాశాల ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థ ల్లో నాణ్యతా వృద్ధిలో ఉత్తమ పద్ధతుల ప్రభావం అంశంపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు శనివారం ముగి సింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ మెద్యూ శ్రీరంగం మాట్లా డుతూ నూతన సాంకేతికతను అందిపు చ్చుకొని విద్యార్థులను మరింత సమర్థవం తంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక పద్ధతులకు అధ్యాపకులు శ్రీకారం చుట్టాలన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం కంప్యూటర్స్‌ విభాగాధిప తి బాబురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మరింత మెరు గైన బోధనను అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. 

Read more