నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి
ABN , First Publish Date - 2020-12-05T05:51:41+05:30 IST
ఉన్నత విద్యారంగంలో అధ్యాపకులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఏపీ ఉన్నత విద్యా మండ లి ఉపాధ్యక్షుడు ఆచార్య రామమోహనరావు అన్నారు.
నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి
వన్‌టౌన్, డిసెంబరు 4 : ఉన్నత విద్యారంగంలో అధ్యాపకులు తమ బోధనా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఏపీ ఉన్నత విద్యా మండ లి ఉపాధ్యక్షుడు ఆచార్య రామమోహనరావు అన్నారు. కేబీఎన్ కళాశాల ఐక్యూఏసీ విభాగం ఆధ్వర్యంలో ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యతా వృద్ధిలో ఉత్తమ పద్ధతుల ప్రభావం అంశంపై రెండురోజుల పాటు జరిగే జాతీయ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ వి. సుభాషిణి, కళాశాల కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాసు, ఐక్యూఏసీ కన్వీనర్ పి. భారతి, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.