పారదర్శకంగా పోలీసు ఉద్యోగాలు

ABN , First Publish Date - 2020-12-15T06:07:29+05:30 IST

పోలీసు శాఖలో 6500 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల కానుందని, ప్రతిభను ప్రాతిపదికగా చేసుకుని పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ చేపట్టనున్నామని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు.

పారదర్శకంగా పోలీసు ఉద్యోగాలు

మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం టౌన్‌ : పోలీసు శాఖలో 6500 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల కానుందని, ప్రతిభను ప్రాతిపదికగా చేసుకుని పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ చేపట్టనున్నామని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం ఉదయం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఈనెల 25న పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు అందజేస్తామన్నారు. జిల్లాలో 140కిపైగా లే అవుట్‌లు సిద్ధం చేశామన్నారు. మొదటి దశలో ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాలు కూడా మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 8914 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రెండో దశలో 12 లక్షల ఇళ్లు నిర్మాణం చేపడతామన్నారు. మూడో దశలో 20 లక్షల ఇళ్లు చేపడతామన్నారు. పదిహేను లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని ఆలోచిస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీ వరకు లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లాలో రెండు లక్షల 34 వేల మంది లబ్ధిదారులకు ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. బెల్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాలని కోడూరు మండలానికి పూతబోయిన కరుణకుమార్‌ కోరారు.  

Updated Date - 2020-12-15T06:07:29+05:30 IST