కన్నవారినే నరికిన కసాయి

ABN , First Publish Date - 2020-12-30T06:38:15+05:30 IST

నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో మంగళవారం రాత్రి దారుణం జరిగింది.

కన్నవారినే నరికిన కసాయి
మృతురాలు వీర్లంకమ్మ

ఎదురుమొండి దీవుల్లో దారుణం

తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం


నాగాయలంక, డిసెంబరు 29: నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం రాత్రి తల్లిదండ్రులను గొడ్డలితో నరికాడు. ఘటనలో తల్లి తమ్ము వీర్లంకమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన తండ్రి నాగేశ్వరరావు(65)ను స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దారుణానికి పాల్పడిన వీరరాఘవయ్యను తాళ్లతో కట్టేసినప్పటికీ, వాటిని విప్పుకొని పరారయ్యాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడు భార్యతో ఘర్షణ జరగడంతో ఆమె సోమవారం తన పుట్టింటికి వెళ్లిపోయిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. దాంతో మంగళవారం రాత్రి వీర రాఘవయ్య మద్యం సేవించి తల్లిదండ్రులపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్‌, నాగాయలంక ఎస్సై కూడిపూడి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా చేయడంతో పాటు, నిందితుడి కోసం సిబ్బందితో గాలిస్తున్నారు.

Updated Date - 2020-12-30T06:38:15+05:30 IST