పెట్టుబడులు ఉపసంహరిస్తే ఉద్యమం
ABN , First Publish Date - 2020-08-16T10:48:22+05:30 IST
జీవిత బీమా సంస్థలో పెట్టుబడులు ఉప సంహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎల్‌ఐసీ మచిలీపట్నం డివిజన్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. కిషోర్‌కుమార్ అన్నారు. సీఐటీయూ కార్యాలయం వద్ద జరిగి

మచిలీపట్నం టౌన్ : జీవిత బీమా సంస్థలో పెట్టుబడులు ఉప సంహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎల్‌ఐసీ మచిలీపట్నం డివిజన్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. కిషోర్‌కుమార్ అన్నారు. సీఐటీయూ కార్యాలయం వద్ద జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో జె.సుధాకర్, టి.చంద్రపాల్, సి.హెచ్. రవి, ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్, ఏఎఫ్‌టీయూ నాయకులు ఎం. సుధాకర్, సి.హెచ్. రామకృష్ణ, ఆఫీసర్ల సంఘ నాయకులు వి.శ్రీనివాస్, దిలీప్, కె.రాజారావు, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, కొల్లాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. బంటుమిల్లి : రైల్వే, జీవితబీమా, రక్షణ రంగం ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యమిస్తామని వామపక్షాల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. మాజేటి శివశ్రీనివాసరావు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, ధనశ్రీ, అజయ్‌ఘోష్, పొదిలివెంకన్న, బొడ్డునాగరాజు, వంగలరాజు తదితరులు పాల్గొన్నారు.