రూ.1.65 లక్షలు అపహరణ
ABN , First Publish Date - 2020-12-05T06:01:59+05:30 IST
రూ.1.65 లక్షలు అపహరణ

విస్సన్నపేట, డిసెంబరు 4: విస్సన్నపేటలో శుక్రవారం రూ.1.65 లక్షలు అపహరణ అయ్యాయని కలగర రామచంద్రాపురానికి చెందిన దొడ్డా కృష్ణారెడ్డి తెలిపారు. కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో పాడిరైతులకు నగదు చెల్లించేందుకు రూ.1.68 లక్షల నగదు డ్రా చేశానని, పెద్దనోట్లు కావడంతో చిల్లరగా మార్చేందుకు సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లానని ఆయన పేర్కొన్నారు. బంకు నిర్వాహకులు చిల్లర లేదనడంతో పుట్రాల రోడ్డులోని భరత్ పెట్రోల్ బంక్‌కు వెళ్లి రూ.3 వేలకు చిల్లర అడిగి, తిరిగి తన ద్విచక్రవాహనం వైపు చూడగా, అప్పటికే తన వాహనం బాక్స్‌లో ఉన్న నగదు కవరు మాయమైందన్నారు. హెల్మెట్లు ధరించిన ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చి ఈ చోరీ చేశారని ఆయన వాపోతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.