-
-
Home » Andhra Pradesh » Krishna » mla vamsi
-
అర్హులందరికీ ఇళ్ల స్థలం
ABN , First Publish Date - 2020-12-27T06:14:20+05:30 IST
అర్హులందరికీ ఇళ్ల స్థలం

హనుమాన్‌జంక్షన్ రూరల్, డిసెంబరు 26 : అర్హులందరికీ ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని ఎమ్మె ల్యే వంశీ అన్నారు. శనివారం ఎ.సీతారాంపురం, అంపాపురం, బండారిగూడెం, కోడూరుపాడు, వీరవల్లి, ఎస్.ఎన్.పాలెం, వేలేరులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. కోడూరుపాడులో అర్హులైన 78 మందికి స్థలాలు కేటాయించకుండా జాబితా నుంచి తొలగించారని సభలో కొందరు వాగ్వా వాదానికి దిగారు. ఏఎంసీ వైస్ చైర్మన్ నక్కా గాంధీ, రత్నసుధాకర్, కసుకుర్తి తదితరులు పాల్గొన్నారు.