రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-15T06:17:10+05:30 IST

రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 14 : రైతు పండిం చిన పంటకు మద్దతు ధరతో పాటు అన్ని విధాలుగా సహకార మందించి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వంశీ అన్నారు. బండా రుగూడెం వద్ద రూ. 15 కోట్లతో పోలవరం కాలువ నుంచి ఏలూరు కాలువకు కలిపే లింకుచానల్‌ తవ్వకం పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కాలువ ద్వారా గోదావరి నీటిని అంపాపురంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో గల మల్లిగాని చెరువు ఆయ కట్టుకు మళ్లించి, అక్కడి నుంచి ఏలూరు కాలువకు కలపనున్నుట్టు తెలిపారు.నక్కా గాంధీ, మాజీ జడ్పీటీసీ సుంకర బోసు, రైతు నాయకులు అవిర్నేని శేషగిరిరావు, చెరు కూరి శ్రీనివాస్‌, కోడెబోయిన బాబి, గూడవల్లి సుధాకర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:17:10+05:30 IST